Sunday, July 10, 2011

Chittoor Corporation to have 65 Divisions

News Courtesy: Andhra Jyothi
చిత్తూరు మునిసిపాలిటీని కార్పొరేషన్‌గా మార్పు చేయనున్న విషయం పాఠకులకు తెలిసిందే. చిత్తూరు, ఒంగోలు, ఖమ్మం మునిసిపాలిటీలకు కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వారం రోజుల కిందట ఫైళ్లపై సంతకం చేశా రు. జీవో ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఫైల్ న్యాయ శాఖ ఆర్థిక కార్యదర్శి వద్ద పరిశీలనలో ఉంది. 

రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వ జీవో రావచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సెలెక్షన్ గ్రేడుగా ఉన్న చిత్తూరు మునిసిపాటీ జనాభా 2,05,000 ఉంది. మొత్తం 37 వార్డులున్నాయి. ఈ మునిసిపాలిటీతోపాటు పట్టణం చుట్టుపక్కల ఉన్న 16 పంచాయతీలను సైతం విలీనం చేసి కార్పొరేషన్ చేయాలంటూ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.



16 పంచాయతీల్లో జనాభా సుమారు 50వేలుగా ఉంది. ఈ లెక్కన 16 పంచాయతీలు, మునిసిపాలిటీ జనాభా కలిపితే 2.50-3.00 లక్షల అవుతుంది. సాధారణంగా కార్పొరేషన్ కావాలంటే కనీసం 50 డివిజన్లు ఉండాలి. ఒక్కో డివిజన్‌లో 3వేల నుంచి 5వేల వరకు జనాభా ఉండాలి. 16 పంచాయతీల విలీనంతో కార్పొరేషన్ జనాభా 3 లక్షలకు చేరుకోనుండటంతో దాదాపు 65 డివిజన్లు అయ్యే అవకాశం కనిపిస్తోంది.

తొలి డివిజన్ మురకంబట్టు..? 
చిత్తూరు కార్పొరేషన్ మొదటి డివిజన్ మురకంబట్టు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కార్పొరేషన్ అయితే నగరంలోని ఈశాన్య భాగం నుంచే మొదటి డివిజన్‌ను సర్వే ప్రకారం అధికారులు గుర్తిస్తారు. ఈ లెక్కన మురకంబట్టు (తిరుపతి రోడ్డు) ఈశాన్యంలో ఉంది. దీంతో చిత్తూరు కార్పొరేషన్ మొదటి డివిజన్ మురకంబట్టు కానుందని తెలిసింది.

3 comments:

  1. official info is 3 new corps will have 50 divisions each

    ReplyDelete
  2. If Murukabattu is 1st division, then Reddygunta/Gangasafaram will be 50th

    ReplyDelete
  3. Hope we get a educated and comitted mayor. He will have to be the best because he will be ever remembered as first mayor oof chittoor city

    ReplyDelete

Your comments will be moderated. Keep the discussions healthy and useful to others. Desist from unwarranted criticism, foul language and rude comments.