Saturday, March 29, 2014

ముఖ్య నివేదన

రేపే చిత్తూరు నగరపాలిక మెదటి ఎన్నికలు.

ఎటువంటి ప్రలోభాలకు లొంగకండి

ఓటు మీ చేతిలో బ్రహ్మాస్తరం. 

మీ మనసాక్షికి అనుగునంగా చిత్తూరు అభివృద్ది కోరి ఓటు వేయండి.

రెండు దశాబ్దాలుగా రాష్టృంలోనే వెనకబడి పోయాం. ఇలాగే ఉందామా? అభివృద్ది బాటలో పయనిద్దామా?

గుర్తుంచుకోండి మనచిత్తూరు భవిష్యత్తు మీ చేతుల్లో.

Wednesday, March 26, 2014

తస్మాత్ జాగ్రత్త-1

మిత్రులారా మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి. చిత్తూరు కి సంబంధించినంత వరకు ఇవి చారిత్రాత్మకమైన అతి ముఖ్యమైన ఎన్నికలు.

సీమాంధ్ర లో మొదటి ఎన్నికలు. నగర పాలక సంస్ధగా చిత్తూరుకీ మొదటి ఎన్నికలే.

మన చిత్తూరు అని మనమందరం ఎంత అభిమానంగా పిలుచుకుంటున్నా, దానిలో కాస్తంత కూడా మన ఘనత వహించిన రాజకీయ నాయకులలో లేకపోవడం మన దౌర్భాగ్యం. 

అభివృద్దిలో మనం అట్టడుగున ఉండిపోవడానికి రాజకీయ నాయకుల బాధ్యత ఎంత?????

అధికార పార్టీ నాయకుడి బృందం  కాంగ్రెస్  మరియు ఇండిపెండట్ గా నామినేషన్లు దాఖలు చేయడం వెనక అంతరార్ధం ఏమిటి.కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి ప్రస్తుత ఎన్నికల లో ఆగమ్యగోచరంగా ఉంది.కాంగ్రెస్ విభజన పేరుతో చేసిన గాయం సీమాంధ్ర ప్రజలు ఎవరూ మరిచిపోలేదు. మరి ఈయన కాంగ్రెస్ కి రాజినామా చేయకుండానే ఇండిపెండట్ గా పోటీకి దిగడం/దింపడం ఎంత వరకు సమంజసం. 

ఎన్నికల తరువాత మళ్ళీ కాంగ్రెస్ లో దూకేస్తారని ప్రజల్లో అనుమానం గట్టిగా ఉంది. నిన్న మెన్నటిదాకా ప్రధాన సామాజిక వర్గానికి చెందినట్లు బావించిన మహిళను ఎన్నికలు ప్రకటించగానే వెనకబడిన వర్గానికి చెందినట్లు చెప్పడంపై కాస్ధంత స్పష్టత రావలసిన అవసరం ఉంది. ఇక వీరు ప్రచారానికి చెబుతోంది మేము చేసిన అభివృద్ది చూసి మాకే వోటేయండని. కాసిన్ని సిమెంట్ రోడ్లు మరి కొన్ని బోర్లు తప్ప అభివృద్ది కనిపించట్లేదని విమర్శలున్నాయి. ఇక అవినీతి ఆరోపణలూ తీవ్రంగా ఉన్నాయి. ఇళ్ళ అనుమతులకు లంచాలు, వ్యాపార సంస్ధల నుంచి బలవంతపు చందాలు, తాగునీటి ట్యాంకర్ల బిల్లుల చెల్లింపుల పేరిట వాటాలు,  కార్పోరేషన్ కార్యాలయానికి స్వంత పేరు తగిలించుకోవడం లాంటి తీవ్రమైన ఆరోపణలు ఎన్నో ఉన్నాయి. వీళ్ళకు  పుర ప్రజల సమ్మతి బాగా తగ్గిందనేది నిర్వివాదాంశం.

2వ భాగంలో తెదేపా వైయసార్సీ గురించి
( నగర పాలక సంస్ధ ఎన్నికల గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకోండి. అసభ్య, వ్యక్తిగత దూషణలు వెంటనే తొలగించబడుతాయి.)

Saturday, March 15, 2014

CONGRESS HATAO CHITTOOR BACHAO

Dear Friends,

This is not from TDP, YSRCP, BJP and not even Pawan Kalyan Jana Senate, but from a fellow chittorean who is worried about chittoor.

Leaving all the facts about the undemocratic division of state for purely election benefits, the anger is clearly palpable all over seemandhra.

Congress is going to be washed away in this anti wave as per many election surveys. Now if Congress is elected in chittoor that will be sealing of fate and end of development for chittoor.

So think before you vote