ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని కథాంశంతో హార్రర్, సస్పెన్స్ నేపథ్యంతో వస్తున్న చిత్రం 'చిత్తూరు'. చిన్నా, అనూష జంటగా శ్రీ వీరభద్ర సినీ క్రియేషన్స్‌పై మధుసూధన్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయసూర్య దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. చిత్రీకరణ పూర్తయిందని, కథాపరంగానే 'చిత్తూరు' టైటిల్ పెట్టామని దర్శక, నిర్మాత అన్నారు.