Wednesday, June 18, 2014

నిలదీసి ప్రశ్నించండి !


స్నేహితులారా, దశాబ్దాల వెనకబాటు నశించాలంటే, పాలకులను ప్రశ్నించండి. 

చాలా సర్దుకుపోయాం. ఇక చాలు. మనకింతే, మన వూరింతే, మనమేం చేయలేం అనుకుంటే తీవృంగా నష్టపోతాం. భావి తరాలకు తీవృ ద్రోహం చేసిన వారవుతాం.


కొత్త రాష్ఠ్రం లో వివిధ సంస్థల స్థాపన, అభివ్రుధ్ది కార్యక్రమాల రూపకల్పన లో చిత్తూరు పేరు అస్సలు వినపడడం లేదు. మన గోడు ఎలుగెత్తి చాటాల్సిన సమయం ఇదే.

తిరుపతి కి ఏ కేటాయింపు జరిగినా అది మొత్తం చిత్తూరు జిల్లాకు కేటాయించినట్లు వూదరగెట్టేస్తున్నారు. అయ్యా చిత్తూరు జిల్లా అంటే తిరుపతొక్కటే కాదు. వనరలు నీళ్ళు లేని పేద్ద జిల్లా మరియు చిత్తూర నే పేరు తో ఒక జిల్లా కేంద్రం కూడా ఉన్నాయి. 

జనాల నోట్లో  నానుతున్నట్లు రేపు తిరుపతి ని బాలాజీ జిల్లా గా విడదీస్తే చిత్తూరుకి మిగిలేది చిప్పేగా. తిరుపతి లేని చిత్తూరు లో అభివృధ్ది సున్నా. 
మెత్తం అభివృధ్ది హైదరాబాదు చుట్టూ పరిమితం చేసి, మొన్నటికి మొన్న తెలంగాణా కి గుత్తగా అప్పజెప్పి తరిమినప్పుడు ఎంత బాధ పడ్డామో మనందరికీ బాగా తెలుసు. ఇప్పుడు తిరుపతి విడదీస్తే తిరిగి ఇదే పరిస్తితి తలెత్తదదా???
అన్ని యూనివర్సిటీ లు, విద్యాలయాలు, వైద్యసంస్ధలు తిరపతిలో మాత్రమే కేంద్రీకృతం అయ్యాయి. ఇప్పుడు తిరుపతి వేరుపడితే మిగిలిన జిల్లా గాఢాంధకారమేగా. ఐప్పుటికీ మేల్కోరా. 

ఇలాంటి పరిస్ధితి లో తిరిగి కొత్త పధకాలు కోసం తరిగి  తిరుపతి పై మాత్రం దృష్టి పెడతున్నారు. కొత్తగా ఏదన్నా జిల్లా ఏర్పడితే కొత్తగా వసతుల కల్పన లాంటివి చేపట్టాలి. కానీ ఇక్కడ అంతా రివర్సు. వందేళ్ళ పాత జిల్లా ఏమీ లేకుండా మిగలబోతోంది. ఒక్క ప్రభుత్వ యూనివర్సిటీ విద్యాలయాలు, వైద్యసంస్ధ కూడా అవశేష చిత్తూరు జిల్లాలో మిగలవు.

చిత్తూరు జిల్లా రెండుగా విడిపోవడం తధ్యం. మరి విడదీసే ముందు అభివృధ్ది వికేంద్రీకరణ అత్యవసరం. ఐది వందేళ్ల చిత్తూరు జిల్లా జీవన్మరణ సమస్య. అయ్యా ప్రజా ప్రతినిధులూ మేల్కొనండి. కాస్తైనా న్యాయం చేయండి.

ఈ విషయంలో మీ అభిప్రాయాలను ఆలోచనల ను మీ కామెంట్ల ద్వారా పంచుకోండి